Breaking News

ట్రంప్‌ దగ్గర ఉద్యోగం.. మస్క్‌ సంపద మటాష్‌!

Published on Wed, 06/11/2025 - 21:52

ప్రపంచ టెక్‌ బిలీయనీర్‌, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్‌నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది.


తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్‌లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్‌ దగ్గర పనిచేసినందుకు ఎలాన్‌ మస్క్‌ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్‌బర్గ్‌ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్‌ చేయగా దానికి ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్‌ ఇట్‌’ అంటూ కామెంట్‌ చేశారు.

మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్‌గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్‌ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)