Breaking News

టెక్‌ మహీంద్రా కీలక నిర్ణయం .. ఆనందంలో ఉద్యోగులు

Published on Mon, 08/07/2023 - 13:06

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జాబ్‌ మార్కెట్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

గత ఏడాది విడుదలై జాబ్‌ మార్కెట్‌లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌పై 8 వేల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యూహాత్మక అడుగుతో జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, మార్కెటింగ్ హెడ్ హర్షేంద్ర సోయిన్ సంస్థ వృద్ధి సాధించడంలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్‌, మ్యానఫాక్చరింగ్, రిటైల్‌పై సంస్థ దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.  
 
సవాళ్లు - అవకాశాలు
ఏఐ,ఎమర్జింగ్ టెక్నాలజీలపై టెక్ మహీంద్రా దృష్టి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూన్ త్రైమాసికంలో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది, గత సంవత్సరంతో పోలిస్తే నికర లాభంలో 38% క్షీణతను చవిచూసింది. కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఎంటర్‌ టైన్‌మెంట్‌ (సీఎంఈ) విభాగంలో ఈ సవాళ్లకు దోహదం చేసింది. అయితే భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేసిన ప్రస్తుత సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలను వృద్ధికి కీలక టెక్నాలజీ రంగాలుగా గుర్తించారు. ఇందులో భాగంగా, ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏఐపై శిక్షణ ఇ‍వ్వనున్నట్లు వెల్లడించారు. 

ఇదీ చదవండి ➤ ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)