ఐటీ ఫైలింగ్‌కి ఉపక్రమించండి... మహాశయా..!

Published on Mon, 09/01/2025 - 10:59

గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023–24 గానూ సుమారు 9 కోట్ల రిటర్నులు చేసినట్లు ఒక లెక్క ఉంది. ఇక 2024–25కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25.8.2025 నాటికి 3,67,94,801 రిటర్నులు పడ్డాయి. అంటే ఫైల్‌ చేసినట్లు. ఇందులో 3.54 కోట్ల మంది సక్రమంగా వెరిఫై చేశారు. గొప్ప విషయం ఏమిటంటే 2.29 కోట్ల మంది రిటర్నులు ప్రాసెస్‌ అయ్యాయి. అంటే అస్సెస్‌మెంట్‌ అయినట్లే. 13 లక్షల మంది వెరిఫై చేయలేదట.

మీరు ఒకసారి చెక్‌ చేసుకొండి. వెరిఫై చేసుకోపోతే వెంటనే వెరిఫై చేయండి. వైరిఫై జరిగితే కానీ అసెస్‌మెంట్‌ మొదలుపెట్టరు. గతవారం అయితే రిటర్నులు వేసిన కొంతమంది అసెస్‌మెంట్‌ పూర్తి చేసి రీఫండ్‌ మొత్తాన్ని వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ వారి కృషి, కష్టాన్ని, సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. శెహభాష్‌...  

టాక్స్‌ అడిట్‌ అవసరం లేని వారికి జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు గడువు తేది ముందుగానే పొడిగించారు. గతంలో పొడిగింపుల పర్వం లేదా వాయిదాల పద్ధతి ఉండేది. దానిని పక్కన పెట్టి గత 2 ఏళ్లుగా ఎటువంటి పొడిగింపు చేయకుండా నిలకడగా ఉన్నారు. కానీ ఏడాది ఆరంభంలో ఈసారి పెద్ద పొడిగింపు చేశారు. ఇప్పుడు అన్‌లైన్‌లో పనులు చకచకా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫాస్ట్‌గా, మృదువు గా బండి నడుస్తోంది. ఈ కాలమ్‌ చదివే సమయానికి ఫైలర్ల సంఖ్య 4 కోట్లు దాటిందన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకో 5 కోట్లకు పైచిలుకు రిటర్నులు వేయాలి. మీరు వేసిన 4 కోట్ల మందిలో ఉన్నారా..? వేయాల్సిన 5 కోట్ల మందిలో ఉన్నారా..?

  • వెంటనే ఏం చేయాలంటే...  
    పాన్‌ కార్డుని తీయండి
  • ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోండి.  
  • మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో ఆరా తీయండి. చాలా మందికి ఒక అకౌంటు లేదా రెండు అకౌంట్లు గుర్తుంటాయి. నిత్యం వాడే అకౌంట్లు గుర్తుంటాయి. ఎన్ని ఉన్నాయో మరిచిపోతుంటాము. ఎవరో తెలిసిన వ్యక్తి లోన్‌ ఇప్పిస్తాడు. అప్పుడు బ్యాంకులో అకౌంటు ఓపెన్‌ చేస్తాము. లోన్‌ క్లియర్‌ అయ్యాక ఈ సంగతి మరిచిపోతాము. ఉద్యోగాల బదిలీ వలన, ఇంటికి దగ్గరగా ఉందనో.. దగ్గర బంధువు ఉన్నాడని తెరిచిన అకౌంటు... ఇలా ఒక జాబితా చేసుకొండి. అన్నీ బ్యాంకు అకౌంటు వివరాలు సేకరించండి. వాటిలో వ్యవహారాలకు వివరాలు రాసుకొండి. ఇన్నీ ఉన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే రిఫండ్‌ కోసం ఎంచుకోండి. అలా ఎంచుకోకపోతే రీఫండ్‌ రానే రాదు.  
  • వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు... వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తాము. గుర్తు తెచ్చుకోండి. పుట్టింటి నుంచి వచ్చిన డబ్బును అదే ఊరిలో ఫిక్స్‌డ్‌ వేసి మరిచిపోయే నారీమణులు ఎందరో.... అన్ని వివరాలు సేకరించండి.
  • మీరు ఉద్యోగస్తులు అయితే ఫారమ్‌ 16 అడగండి. అందులో అన్నీ వివరాలు చెక్‌ చేసుకొండి.  
  • ప్రతి నెలా తయారయ్యే శాలరీ స్లిప్‌ను జాగ్రతగా ఉంచండి.  
  • ఫారమ్‌ 16 ఎ లో కరెక్ట్‌ చేసి భద్రపరచండి.
  • డివిడెండ్ల మీద ఆదాయం బ్రోకర్‌ని అడిగి తెలుసుకొండి. స్టేట్‌మెంట్‌ తీసుకొండి.  
  •  మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు అమ్మకాలు స్టేట్‌మెంట్‌ తీసుకొండి. పూర్తి స్టేట్‌మెంట్‌ అడగండి
  • అద్దె మీద ఆదాయం ఆదాయం ఉంటే ఇంటి అడ్రెస్సు, కిరాయిదారు పాన్‌/ఆధార్‌ తీసుకొండి. ప్రాపర్టీ టాక్సు రశీదులు తీసుకోండి.  
  • విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే మొత్తం వివరాలు తెలుసుకోండి
  • అలాగే విదేశీ ఆస్తుల మీద ఆదాయం కూడా  
  • పాత పద్ధతిలో డిడక్షన్లకు అయితే అన్ని కాగితాలు, వివరాలు కావాలి. అద్దె రశీదులు... విరాళాల వివరాలు ఉండాలి.  
  • కరెక్ట్‌ ఫారాన్ని సెలెక్ట్‌ చేసుకోండి. డిపార్ట్‌మెంట్‌ వారి ఉపకరణాలు ఉపయోగపడుతాయి.  
  • ఇప్పుడు ఫైలింగ్‌కు ఉపక్రమించండి.  ఆల్‌ ద బెస్ట్‌.....   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)