Breaking News

అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్‌ఆర్‌

Published on Sat, 04/05/2025 - 21:21

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్‌లో తయారయ్యే కార్లను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

అమెరికా అధ్యక్షుడు విధించిన 25 శాతం దిగుమతి సుంకం ఖర్చును ఎలా తగ్గించాలో పరిశీలిస్తున్న సమయంలో.. బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన జేఎల్‌ఆర్‌ (JLR) సోమవారం నుంచి ఈ చర్య తీసుకుంటున్నారని ది టైమ్స్ తెలిపింది. బ్రిటన్‌లో ఈ కంపెనీ సుమారు 38000 మందికి ఉపాధి కల్పిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ట్రంప్ ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ కార్ల ఎగుమతులను ఒక నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రెండు నెలలకు సరిపోయే కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్

మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ట్రంప్ సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)