Breaking News

దూసుకెళ్లిన టాటా షేర్లు, ఒక్కో షేర్‌ను రూ. 500కి కొంటే.. ఒక్కరోజే ఇంత లాభమా!

Published on Thu, 11/30/2023 - 16:16

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో టాటా టెక్నాలజీ షేర్లు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. ఐపీఓ తర్వాత ప్రారంభమైన తొలిరోజు ఇంట్రా- డే ట్రేడింగ్‌లో టాటా టెక్నాలజీ షేర్లు 180 శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓ తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్‌ టాటా టెక్నాలజీ షేర్ల తరహాలో ఇతర ఏ కంపెనీ ఈ స్థాయిలో షేర్లు రాణించలేదు.   

నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో టాటా టెక్నాలజీ షేర్‌ ధర రూ.1,200 అమాంతం పెరగగా, బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అదే షేర్‌ వ్యాల్యూ రూ.1,199కి చేరింది. దీంతో ఆ స్టాక్‌ వ్యాల్యూ ఐపీఓ సమయంలో ఉన్న ధర కంటే 140 శాతం రెట్టింపు అయ్యింది. 

సరిగ్గా ఉదయం 11.47 గంటల సమయానికి 167 శాతానికి రూ.1338 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఇక మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో టాటా టెక్నాలజీ ధర రూ.1,327 వద్ద స్ధిరపడింది. బీఎస్‌ఈలో రూ.1,326 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. 

టాటా గ్రూప్‌ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్నాలజీస్‌ రూ.3042 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)