Breaking News

తొలిరోజే 70వేల బుకింగ్స్‌: ఈ కారుకు ఫుల్ డిమాండ్!

Published on Fri, 12/19/2025 - 16:24

సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్‌ ఎస్‌యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వివేక్‌ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్‌ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్‌ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్‌ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.

మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.

ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి

వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్‌, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)