Breaking News

సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఎఫ్‌వోఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతి

Published on Sat, 10/25/2025 - 08:24

సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌) పథకంలోకి తాజా పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది. మార్కెట్‌ పరిస్థితులు కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురికావడంతో తాజా పెట్టుబడులకు అనుమతించినట్టు తెలుస్తోంది.

సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఎఫ్‌వోఎఫ్‌లో ఏక మొత్తంలో పెట్టుబడి, క్రమానుగత పెట్టుబడి (సిప్‌), క్రమానుగత పెట్టుబడి బదిలీ (ఎస్‌టీపీ)లను నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14న టాటా మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించడం గమనార్హం. ధరలు అనూహ్యంగా పెరుగుతూ వెళుతున్న తరుణంలో రిస్క్‌ నియంత్రణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. మార్కెట్‌ పరిస్థితులు సాధారణంగా మారడంతో తిరిగి ఏక మొత్తంలో పెట్టుబడులు, తాజా సిప్‌లు, ఎస్‌టీపీలను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)