Breaking News

టాటా గ్రూప్‌ షేర్లకు రెక్కలు..

Published on Thu, 09/17/2026 - 16:48

టాటా సన్స్ చైర్మన్ గా ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందన్న వార్తలతో గురువారం టాటా గ్రూప్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రధానంగా టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ స్టాక్స్ నిఫ్టీ రికవరీకి బలమైన ఊతాన్నిచ్చాయి.

బోర్డు నిర్ణయం వెనుక..

టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. ఆయన మొదట పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ, గ్రూప్ నాయకత్వం, కార్పొరేట్ పరివర్తన సమర్థవంతంగా సాగాలంటే ఆయనే కొనసాగాలని నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ కోరింది.

దీంతో ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. బోర్డు సమావేశంలో నోయల్ టాటా మినహా మిగతా సభ్యులందరూ చంద్రశేఖరన్ పునఃనియామకానికి అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం.

స్టాక్ మార్కెట్లో మార్మోగిన టాటా గ్రూప్ షేర్లు

  • టాటా కెమికల్స్ షేర్ల ధర 14% పెరిగి రూ.832 (19 వారాల గరిష్టం) లకు చేరి 6% లాభంతో రూ.775.10 వద్ద క్లోజైంది.

  • టాటా మోటార్స్ (PV) షేర్ల విలువ 6% పైగా పెరిగి రూ.319.8 (16 వారాల గరిష్టం) గరిష్టాల వద్ద స్థిరంగా ట్రేడవుతుతోంది.

  • టాటా ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు 6% పెరిగి రూ.733.50 తాకి ఇంట్రాడే గరిష్ట స్థాయిల్లో కొనసాగుతోంది.

  • టీసీఎస్ (TCS) షేర్లు 3% పైగా ఎగిసి రూ.2,263.60 లను తాకి ఫ్లాట్‌గా (రూ.2,193.50) ట్రేడవుతున్నాయి.

కలిసొచ్చిన ఆర్బీఐ నిర్ణయం

కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా ఉన్న టాటా సన్స్, లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి ఆ హోదాను రద్దు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ దరఖాస్తును ఆర్బీఐ ఇటీవల తిరస్కరించింది.

ఈ పరిణామం టాటా సన్స్‌లో వాటాలు కలిగిన గ్రూప్ కంపెనీలకు (ముఖ్యంగా టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్) తీవ్ర ప్రయోజనం చేకూర్చడంతో ఈ వారం ప్రారంభం నుంచే మార్కెట్లో కొనుగోళ్ల పండగ కనిపిస్తోంది. బోర్డులో తాజా నాయకత్వ నిర్ణయం ఈ ర్యాలీకి మరింత ఊపందించింది.

Videos

Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు

పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..

నిజామాబాద్ నగరంలో దారుణం

Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)