Breaking News

ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి..!

Published on Thu, 05/15/2025 - 16:29

పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.

పాకిస్తాన్ జీడీపీ కంటే తమిళనాడు జీడీపీ ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతే కాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన.. పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువ. ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని మానుకుని.. ఆర్ధిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై ద్రుష్టి పెట్టాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలి. అప్పడే మీ దేశం బాగుపడుతుందని నౌక్రీ.కామ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్‌చందానీ వెల్లడించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. 1995లో తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్ల వద్ద, పాకిస్తాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. కాగా 2025 నాటివి తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు) కాగా.. పాకిస్తాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్లు (రూ. 33.9 లక్షల కోట్లు).

ఇదీ చదవండి: అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు తమ గర్వాన్ని చాటుకుంటూ.. పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు అని యూజర్ వెల్లడించగా.. ఒక్క కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్ సమస్య తీరితే.. ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్తాన్ జీడీపీ దాటేస్తుందని మరో యూజర్ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయని ఇంకో యూజర్ అన్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)