Breaking News

హైదరాబాద్‌లో స్విమ్‌లేన్‌ కేంద్రం ప్రారంభం

Published on Wed, 11/01/2023 - 18:17

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలందించే స్విమ్‌లేన్‌.. హైదరాబాద్‌లో ప్రాంతీయ సైబర్‌సెక్యూరిటీ ఇన్నోవేషన్‌తోపాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ప్రారంభించింది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ ‘కొత్త లొకేషన్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఫంక్షన్‌లకు వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, కస్టమర్లకు ప్రత్యేక సేవలు అందించేలా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు’ స్విమ్‌లేన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఫ్రాన్స్ జేవియర్ అన్నారు. ఈ సెంటర్‌లో ప్రస్తుతం 75 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 200కి పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్ధ్యంతో సామర్థ్యాలతో స్విమ్‌లేన్ టర్బైన్ తక్కువ-కోడ్ సెక్యూరిటీ ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేస్తుంది. సెక్యూరిటీ అలర్ట్ , డేటా ఓవర్‌లోడ్, దీర్ఘకాలిక సిబ్బంది కొరతను అధిగమించేలా ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ బృందాలకు సహాయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రాన్స్ జేవియర్ వెల్లడించారు. 

పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా
భారత్‌ అన్నీ రంగాల్లో అభివృద్ది పథం వైపు దూసుకెళ్తుంది. అపారమైన నైపుణ్యం కలిగిన వనరులకు కొదువలేదని ఫ్రాన్స్‌ జేవియర్‌ కొనియాడారు. 2027 నాటికి భారత్‌లో సైబర్‌సైక్యూరిటీ మార్కెట్‌ 3.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటున్నదన్న అంచనాతో ఇక్కడ మరో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్టు తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)