Breaking News

రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..

Published on Thu, 12/04/2025 - 15:06

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.

‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

Videos

మోదీ-పుతిన్ వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు సిద్ధం..!

రెపో రేటును తగ్గించిన RBI

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?