Breaking News

ఒడిశా నుంచి దుబాయ్‌: సక్సెస్ కోసం 17 ఏళ్ళు

Published on Mon, 01/27/2025 - 19:24

కష్టాల సుడిగుండాలు దాటి.. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 'సౌమేంద్ర జెన' (Soumendra Jena). ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు దుబాయ్‌లో విలాసవంతమైన భవనం, పోర్స్చే టైకాన్, జీ వ్యాగన్ బ్రబస్ 800 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల తన స్ఫూర్తిదాయకమైన విజయగాథను పంచుకోవడానికి ఫోటోలను షేర్ చేశారు.

సౌమేంద్ర జెన తన ఎక్స్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫొటోలో చిన్న ఇల్లు, మరో ఫోటోలో విలాసవంతమైన ఇల్లు, దాని ముందర ఖరీదైన కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 12వ తరగతి వరకు (1988 నుంచి 2006 వరకు) ఇక్కడే చదువుకున్నాను. నా జ్ఞాపకాల కోసం మళ్ళీ 2021లో ఇక్కడికి వచ్చాను.

ఇప్పుడు దుబాయ్‌లో నాకు విలాసవంతమైన ఇల్లు ఉంది. కార్లు ఉన్నాయి. ఇదంతా.. నా 17 సంవత్సరాల శ్రమ, నిద్రలేని రాత్రులు వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడనికి సమయం పడుతుంది. దీనికి ఎలాంటి షార్ట్‌కట్‌లు లేవు అని అన్నారు.

సోషల్ మీడియాలో సౌమేంద్ర జెనా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్లలో మీరు ఏమి చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను నా కోసం ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు, విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం అన్నీ అవసరం. నువ్వు దుబాయ్‌లో ఉన్నావు. అదే ఒడిశాలో ఉండి ఉంటే ఇలా సక్సెస్ సాధించడం కష్టమయ్యేదని అన్నారు.

ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు

సౌమేంద్ర జెన ఫైనాన్స్ సెక్టార్‌లో ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 4,87,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఆర్ధికపరమైన విషయాలను, పెట్టుబడికి సంబంధించిన సలహాలను ఇస్తూ ఉంటాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)