Breaking News

‘చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి’

Published on Fri, 09/05/2025 - 15:01

రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌పై సుంకాలు, యూరప్‌పై ఒత్తిడి

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్‌ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్‌ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.

యూరప్‌ తీరుపై అసహనం

యూరప్‌ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.

ఇదీ చదవండి: వైట్‌హౌజ్‌లో టెక్‌ సీఈఓలకు ట్రంప్‌ విందు

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు