Breaking News

కొనసాగిన టారిఫ్‌ టెన్షన్‌

Published on Fri, 08/29/2025 - 01:14

ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఒక దశలో సెన్సెక్స్‌ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్‌ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. 

ట్రాన్స్‌ఫార్మర్‌ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్‌ ఎల్రక్టానిక్స్‌ లిస్టింగ్‌ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్‌ఈలో అరశాతం డిస్కౌంట్‌ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు