Breaking News

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published on Wed, 01/15/2025 - 09:29

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.

ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నా​యి. ఈ స్థాయిల్లో మార్కెట్‌ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.1 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.2 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’

రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్‌ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్‌ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్‌ దాటి స్థిరపడితేనే పొజిషన్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)