Breaking News

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. మదుపర్లకు కాసుల వర్షం!

Published on Wed, 12/27/2023 - 16:28

దేశీయ స్టాక్‌ మార్కెట్ బెంచ్‌మార్క్‌ సూచీలు బుధవారం వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. వచ్చే సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఊహించిన బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో సానుకూల ధోరణిని పెంపొందించాయి.

నిఫ్టీ 213.40 పాయింట్లు లాభపడి 21,654.75 పాయింట్లను తాకింది.  సెన్సెక్స్ కూడా 701.63 పాయింట్లు ఎగిసి 72,038.43 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు సూచీలు తాజా ముగింపు శిఖరాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి లాభంతో డిసెంబరులో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 8 శాతం ఎగబాకాయి. 

బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో రూ.358.9 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 361.3 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మదుపర్లు  ఒక్క సెషన్‌లోనే దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల మేర సంపన్నులయ్యారు.

ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, లార్సెన్ & టూబ్రో, నెస్లే, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్‌తో సహా 360కి పైగా స్టాక్‌లు బీఎస్‌ఈలో ఇంట్రాడే ట్రేడ్‌లో తమ తాజా 52 వారాల గరిష్టాలను తాకాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)