Breaking News

ఆగని బుల్‌ పరుగు

Published on Wed, 07/10/2024 - 00:07

ముంబై: ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్‌ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్‌ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్‌(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్‌ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.

ఆటో, ఎఫ్‌ఎంసీజీతో పాటు కన్జూమర్‌ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్‌ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్‌ గూడ్స్, టెక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మారుతీ పరుగు
⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం హైబ్రిడ్‌ కార్ల రిజి్రస్టేషన్‌ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.  

⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్‌ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్‌ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 

బీఎస్‌ఈః రూ. 451.27 లక్షల కోట్లు 
⇒ స్టాక్‌ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)