Breaking News

స్టాక్‌మార్కెట్లు భారీ పతనం.. టాప్‌ లూజర్‌ టాటా స్టీల్

Published on Mon, 04/07/2025 - 15:43

Stock Market Crash: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు కౌంటర్లలో విస్తృత స్థాయి అమ్మకాలతో వరుసగా మూడో సెషన్ లో  తీవ్ర నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2226.79 పాయింట్లు (2.95 శాతం) క్షీణించి 73,137.90 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 కూడా 742.85 పాయింట్లు (3.24 శాతం) నష్టంతో 22,161.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే స్థిరపడగా టాటా స్టీల్ అత్యధికంగా 7.16 శాతం నష్టపోయింది. ఒక్క రోజులో మార్కెట్‌ పతనం గత పది నెలల్లో ఇదే అత్యధికం. బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.403 లక్షల కోట్ల నుంచి రూ.389 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో మదుపరుల సంపద ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్లు ఆవిరైంది. 

వృద్ధిపై పెరుగుతున్న ఆందోళనలు, అమెరికా సుంకాల పతనం మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఇది ప్రస్తుత రిస్క్-ఆఫ్ సెంటిమెంట్‌ను మరింత తీవ్రతరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనలు, వాటికి ప్రతిగా చైనా తీసుకున్న ప్రతీకార చర్యలే ఇందుకు కారణమయ్యాయి.

అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్

ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్‌ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్‌ విలువ ఆవిరైంది. ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. 

  • కాగా.. వచ్చే గురువారం (ఏప్రిల్‌ 10) మహావీర్‌ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్‌ ఈవారం  4 రోజులకే పరిమితంకానుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)