Breaking News

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Published on Tue, 02/11/2025 - 13:40

ముంబై: స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. 1,000పైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. మార్కెట్లు భారీగా క్షీణించడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్టీల్ టారిఫ్ ఆందోళనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి.

పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్: పది సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ఇండియా, అమెరికా గవర్నమెంట్ బాండ్లపై రాబడులు పెరిగాయి. ఈక్విటీల కంటే బాండ్లు సురక్షితం కాబట్టి, మదుపర్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతో మార్కెట్‌లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.

Stock Market:  కుప్పకూలిన స్టాక్ మార్కెట్

ఇదీ చదవండి: రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్‌ సిటీస్‌’

రంగాలవారీ ప్రభావం: లోహాలు, రియల్టీ, మీడియా, హెల్త్ కేర్ సహా వివిధ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. ఇది మొత్తం మార్కెట్ తిరోగమనానికి దోహదం చేసింది.

అంతర్జాతీయ ఆర్థిక అంశాలు: అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)