Breaking News

అకాల వర్షాలు.. శివకాశిలో తగ్గిన బాణాసంచా ఉత్పత్తి

Published on Sun, 11/01/2026 - 16:15

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ బాణాసంచా తయారీ రంగానికి కీలకంగా ఉన్న తమిళనాడులోని శివకాశి ప్రాంతాన్ని అకాల వర్షాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దేశంలోని మొత్తం బాణాసంచా అవసరాల్లో సింహభాగం ఉత్పత్తి చేసే ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విరుదునగర్ జిల్లాలోని ప్రముఖ తయారీ కేంద్రాల్లో ఒకటైన సత్తూరు ప్రాంతంలో అక్టోబర్ 22 నాటికి ఏకంగా 143 మి.మీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల బాణాసంచా తయారీ ప్రక్రియ అస్తవ్యస్తమైంది.

తగ్గిన ఉత్పాదకత

బాణాసంచా తయారీలో అత్యంత కీలకమైన దశ వాటిని ఎండబెట్టడం. రసాయనాలు నింపిన టపాసులను సంప్రదాయబద్ధంగా ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే, అక్కడ కురిసిన అకాల వర్షాల కారణంగా టపాసులు తడిసిపోవడం, సరిగ్గా ఆరకపోవడం జరుగుతోంది. దీనివల్ల తయారీ యూనిట్లలో పనులు మందగించాయి. దీపావళి సీజన్‌కు డిమాండ్‌ను తట్టుకునేలా గడువులోగా సరుకును మార్కెట్లోకి తరలించలేమనే ఆందోళన తయారీదారుల్లో వ్యక్తమవుతోంది.

పెరిగిన ముడిసరుకుల భారం

ప్రకృతి ప్రభావానికి తోడు, తయారీదారులు ఇప్పటికే ముడి పదార్థాల ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. రసాయనాలు, పేపర్‌ ట్యూబ్స్, అట్టపెట్టెలు, ఇతర ఇన్‌పుట్ ధరలు ఎగబాకడంతో తమ లాభాల మార్జిన్లు భారీగా పడిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. ఒకవైపు ముడిసరుకుల ధరల భారం, మరోవైపు వర్షాల ప్రభావం వెరసి శివకాశి పారిశ్రామిక వర్గాలను కోలుకోలేని దెబ్బతీశాయి.

ఉపాధిపై నీడలు

శివకాశి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు ఈ విభాగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పండుగ సీజనే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఈ తరుణంలో వర్షాల వల్ల ఉత్పత్తికి అంతరాయం కలగడం కార్మికుల ఉపాధిపైనా, వేతనాలపైనా ప్రభావం చూపుతోంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరి నిమిషంలోనైనా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు తయారీదారులు శ్రమిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)