Breaking News

నిజాయితీగా పన్ను చెల్లించేవారితో మర్యాదగా మెలగండి: సీతారామన్‌ 

Published on Sat, 10/25/2025 - 04:40

ఘజియాబాద్‌: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్‌టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్‌లో సెంట్రల్‌ జీఎస్‌టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 

అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్‌కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్‌ విచారణలు చేయొచ్చు. 

అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు.  అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్‌టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి. 

పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి  జీఎస్‌టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్‌టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు.   
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)