Breaking News

సిమ్‌ యాక్టివ్‌ ప్లాన్లు.. ఒక్కసారి రీచార్జ్‌ చేస్తే చాలు

Published on Mon, 08/04/2025 - 20:38

చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్‌ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్‌ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్‌ కాకుండా మరో నంబర్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్‌ ఉంచుకొనే రీచార్జ్‌ ప్లాన్‌ల కోసం చాలా మంది చూస్తున్నారు.

డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ  ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఎయిర్‌టెల్ డేటా రహిత ప్లాన్స్
ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు
84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌ల సదుపాయాన్ని అందిస్తుంది.

వొడాఫోన్ ఐడియా ప్లాన్స్
వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్‌టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్‌లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన​్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్‌లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్‌టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.

చదవండి: ఎయిర్‌టెల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.. ఓటీటీలన్నీ ఫ్రీ..

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)