Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
Published on Thu, 01/29/2026 - 15:01
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ ఒక్క రోజే (జనవరి 29) కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.
ధరలు పెరగడానికి కారణం
బంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు వస్తాయనే భయంతో.. చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.
ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
వెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొఅహదపడ్డాయని చెబుతున్నారు.
Tags : 1