Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
Published on Mon, 12/29/2025 - 16:59
భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.
రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా దిగి వచ్చింది.
వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.
వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?
వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ
Tags : 1