Breaking News

వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!

Published on Mon, 09/01/2025 - 17:07

భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,05,880లకు చేరింది. వెండి రేటు రూ. 1,36,000 (కేజీ) వద్ద ఉంది. కాగా సిల్వర్ రేటు మరో మూడేళ్ళలో ఏకంగా రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్,  వైద్య పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. ఆలయాల్లో కూడా వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పెట్టుబడిదారులు వెండివైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు వెండి ధరల్లో పెనుమార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది.

కేజీ వెండి రూ.2 లక్షల వద్దకు చేరుకోవడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఈ ఏడాది వెండి ధరలు ఇప్పటికే 30 శాతం పెరిగి.. జీవితకాల గరిష్టాలను చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ మార్కెట్ ధోరణులు, పారిశ్రామిక వినియోగం, సాంస్కృతిక కొనుగోలు వంటివన్నీ ధరలు పెరుగుదలకు కారణమవుతాయని సీఏ నితిన్ కౌశిక్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వెండి రేటు రాబోయే 12-24 నెలల్లో 15–20% పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ర్యాలీ కొనసాగితే.. కేజీ వెండి రూ. 2 లక్షలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా వెండిపై పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు మొదలైనవాటిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)