Breaking News

బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండి!

Published on Sun, 10/27/2024 - 14:24

బంగారం తర్వాత భారతీయులు వినియోగించే అత్యంత విలువైన లోహం వెండి. ఓ వైపు చుక్కలనంటుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతుండగా వెండి అంతకు మించిన వేగంతో కొండలా పెరుగుతోంది.

రానున్న 12 నుండి 15 నెలల్లో వెండి ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కేజీకి రూ. 1,25,000, కమోడిటీ ఎక్స్చేంజ్‌ (COMEX)లో ఔన్సుకు 40 డాలర్లకుచేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తెలిపింది.

2024లో వెండి ఆకట్టుకునే వృద్ధిని కనబరిచింది. సంవత్సరానికి 40 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది . దేశీయంగా రూ. 100,000 మార్కును అధిగమించింది. వినియోగం, డిమాండ్‌ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు 10 గ్రాములకు స్వల్ప కాలంలో రూ. 81,000 లకు, దీర్ఘకాలికంగా రూ.86,000కి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే కమెక్స్‌లో బంగారం మీడియం టర్మ్‌లో 2,830 డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000 డాలర్లను తాకుతుందని అంచనా వేస్తోంది.

 ఇదీ చదవండి: బంగారమంటే అంత నమ్మకం!

ఇటీవలి సంవత్సరాలలో బంగారం స్థిరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆస్తులలో ఒకటిగా ఉంది. 2021 మినహా 2016 నుండి పసిడి దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బంగారం ధరలు కమెక్స్‌తోపాటు దేశీయ మార్కెట్‌లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంవత్సరానికి 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)