తయారీలో సంస్కరణలు రావాలి

Published on Wed, 09/17/2025 - 08:39

దీర్ఘకాలిక కోణంలో భారత్‌లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని అపోలో హెల్త్‌కో చైర్‌పర్సన్, పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్‌ శోభనా కామినేని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా తయారీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమెరికా విధించిన విపరీతమైన టారిఫ్‌ల వల్ల అనిశ్చితులు తలెత్తాయని ఆమె తెలిపారు. మరింత మెరుగ్గా రాణించేందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచించేందుకు ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని వివరించారు. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. మనం 4 ట్రిలియన్‌ ఎకానమీగా ఎదిగినా, జీడీపీ మూడింతలు పెరిగినా, అందరికీ ఉద్యోగాలు దొరక్కపోతే సామాన్యుడికి ఏం ప్రయోజనం దక్కుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని శోభన చెప్పారు.

ఉద్యోగాలు కల్పించడమనేది ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాల బాధ్యత అని తెలిపారు. భారత్‌లో ప్రతిభావంతులకు కొదవలేదని, ఏఐ సొల్యూషన్స్‌ను రూపొందించడంలో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహించాలని పేర్కొన్నారు. మరోవైపు, తమ యాప్‌ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌ తర్వాత మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా కంట్రీ హెడ్‌ (ఇండియా) అరుణ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Videos

బంగారంపై GST ప్రభావం ఎలా ఉంటుంది..

పాన్ ఇండియా షేక్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్డేట్

భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా

హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధం

అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు

వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన

అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్

మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్

Photos

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే

+5

షారుక్‌ ఖాన్‌ కుమారుడి కోసం తరలిన అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)