Breaking News

మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా

Published on Thu, 07/31/2025 - 13:56

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్‌, మేనేజర్‌ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్‌ ఏఐ పాగా వేసిందని సర్వీస్‌నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్‌ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.

నివేదికలోని అంశాలు

  • కంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.

  • సిస్టమ్‌ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

  • ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.

  • 2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.

  • రిటైల్‌లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్‌లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.

  • టెక్‌ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.

  • భారత్‌లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్‌ ముందుంది.

  • 13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.

  • 57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.

  • ఏఐ రీడిజైన్ చేసిన వర్క్‌ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.

సవాళ్లు ఇవే..

  • ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.

  • టెక్‌ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.

  • కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)