Breaking News

సాక్షి మనీ మంత్ర : దేశీయ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల పరంపర

Published on Wed, 12/06/2023 - 15:46

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లాభాల పరంపర కొనసాగుతుంది. జాతీయ, అంతర్జాతీయ అనుకూల ప్రభావంతో బుధవారం సైతం మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.  

ఆసియా మార్కెట్‌లలో పాజిటీవ్‌ సంకేతాలు దేశీయ మార్కెట్‌లకు మరింత కలిసి వచ్చింది. ఫలితంగా మార్కెట్లు ముగిసే సమయానికి గంట ముందు నిఫ్టీ, సెన్సెక్స్‌ సరికొత్త గరిష్టాల్ని తాకాయి. చివరిగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 405 పాయింట్ల భారీ లాభంతో 69,701 వద్ద నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 20,949 వద్ద ముగిశాయి.  

విప్రో, ఎల్‌అండ్ టీ మైండ్‌ ట్రీ,ఐటీసీ, లార్సెన్‌, టీసీఎస్‌, టాటామోటార్స్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, సిప్లా, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.

కలిసొచ్చిన ఎన్నికలు 
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి  జై కొట్టడంతో స్టాక్‌ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపర్లకు ఉపశమనం కలగడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో దేశంలోకి విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయని మెహతా ఈక్విటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ తాప్సే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తస్మాత్‌ జాగ్రత్త!
దేశీయ స్టాక్‌ సూచీల ట్రెండ్‌ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రోగ్రెసీవ్‌ షేర్‌ బ్రోకర్స్‌ సంస్థ డైరెక్టర్‌ ఆధిత్య గర్గే.. ఇప్పటికే మార్కెట్‌లో భారీ ఎత్తున కొనుగుళ్లు జరిగాయని, ఈ విషయంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

మార్కెట్‌లో ఆయా స్టాక్స్‌ పనితీరు ఎలా ఉందంటే?
♦డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ఇన్వెస్టర్లు టెక్నాలజీ స్టాక్స్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నిర్ణయం ఈ రంగానికి కొంత మార్జిన్ ఒత్తిడిని తగ్గించగలదని నిపుణులు భావిస్తున్నారు. విప్రో , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్‌టిఐమైండ్‌ట్రీ షేర్లు దాదాపు 2-3 శాతం పెరిగాయి.
 
♦ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పాజిటీవ్‌ రేటింగ్‌ ఇవ్వడంతో ఆ సంస్థ షేర్ల కొనుగోలు జరిగాయి. ఆ షేర్ల విలువ ఒక శాతానికి పైగా పెరిగింది. 

♦అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫినాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అసంబద్ధం అని తేల్చడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ జోరు కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్ 2 శాతం పెరిగి నిఫ్టీ 50లో టాప్ గెయినర్‌లలో ఒకటిగా నిలిచింది.

♦ఎథేర్‌ మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు క్షీణించాయి. 1-2 శాతం పడిపోయాయి. పెన్నీ స్టాక్స్‌ జోరును కొనసాగించడం విశేషం. 

♦బ్యాంకింగ్ పేర్లలో ప్రాఫిట్-బుకింగ్ మునుపటి సెషన్‌లో రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. 

♦నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.4 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.2 శాతం పెరిగాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)