ఐటీ షేర్ల అండ.. ఏడోరోజూ ముందడుగు

Published on Wed, 03/26/2025 - 01:24

ముంబై: ఐటీ రంగ షేర్ల అండతో స్టాక్‌ సూచీల ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 757 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ చివరికి 33 పాయింట్లు పరిమిత లాభంతో 78 వేల స్థాయిపైన 78,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్ల స్వల్ప లాభంతో 23,669 వద్ద నిలిచింది. ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఇప్పటికీ అధిక విలువల వద్ద ట్రేడవుతున్న చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో విక్రయాలు చోటుచేసుకున్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌ సూచీ 1.63%, మిడ్‌ క్యాప్‌ ఇండెక్సు 1.13 శాతం నష్టపోయాయి. ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల్లో మినహాయింపు ఉండొచ్చని ట్రంప్‌ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. 

⇒ అధిక విలువ కలిగిన షేర్లలో ఇటీవల దిద్దుబాటు కారణంగా ఐటీ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. పెర్సిస్టెంట్‌ 2.60%, కో ఫోర్జ్‌ 2.25% ర్యాలీ చేశాయి. ఎంఫసిస్, ఇన్ఫోసిస్‌ 1.50% పెరిగాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 1%, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం మేర లాభపడ్డాయి. 

⇒ ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3–5% క్షీణించాయి.   

⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ ఊపందుకుంటుందనే అంచనాలతో బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ సిమెంట్‌ రంగ షేర్లకు ‘బై’ కేటాయించింది. అ్రల్టాటెక్‌ 3.50%, ఏసీసీ, దాల్మియా భారత్, అంబుజా సిమెంట్స్‌ 3% పెరిగాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)