Breaking News

రెండో రోజూ మార్కెట్‌ జోరు

Published on Tue, 12/03/2024 - 04:18

ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. 

రియల్టీ జూమ్‌..: ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్‌ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్‌ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, టెక్‌ఎం, టైటన్, డాక్టర్‌ రెడ్డీస్, ఆర్‌ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్‌ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.

అయితే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్‌ ఇంటర్నేషనల్, అతుల్‌ ఆటో, కొచిన్‌ షిప్‌యార్డ్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

అదానీ గ్రూప్‌ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్‌ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1–0.5 శాతం మధ్య నీరసించాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)