Breaking News

దలాల్ స్ట్రీట్‌లో హిండెన్‌బర్గ్‌ ప్రకంపనలు:11 లక్షల కోట్ల ఢమాల్‌

Published on Fri, 01/27/2023 - 18:50

సాక్షి,ముంబై:  బ‌డ్జెట్‌కు ముందు, దేశీయ స్టాక్‌ మార్కెట్లకు అదానీ  షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి.  అలాగే బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని  కోల్పోయింది. 

చివర్లో కోలుకుని సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం క్షీణించి 59,330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం దిగువన 17,604 వద్ద ముగిసింది. ఫలితంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్‌ క్యాప్‌ లక్షల కోట్లు  తుడుచు పెట్టుకుపోయింది. అదానీ పోర్ట్స్‌, అదానీఎంటర్‌ ప్రైజెస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆటో, ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి.  టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, డా.రెడ్డీస్‌, ఐటీసీ లాభపడగా, దివీస్‌,అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి.  అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాల్లో  8 పైసలు ఎగిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)