మార్కెట్లో రూ.3 లక్షల కోట్లు గోవిందా?

Published on Wed, 02/22/2023 - 13:09

సాక్షి, ముంబై:  వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల  ప్రతికూల సంకేతాలతో ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 17700 స్థాయి వద్ద ఊగిసలాడింది.  ఆ తరువాత  అమ్మకాలు వెల్లువెత్తడంతో  సెన్సెక్స్‌ 785 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు చేరింది. అటు  కుప్పకూలిన నిఫ్టీ 235  పాయింట్ల నష్టంతో  17600 స్థాయిని కోల్పోయింది.  చివరికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు క్షీణించి 59,744.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇప్పటికే మంగళవారం నాటి గణాంకాల ప్రకారం  బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.265.21 లక్షల కోట్ల నుంచి రూ.2.79 లక్షల కోట్ల నుంచి రూ.262.41 లక్షల కోట్లకు పడిపోయింది. అటు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో వరుస నష్టాలతో అదానీకి  భారీ షాకే తగులుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ మంగళవారం రూ.8,07,794 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు పడి పోయింది. ఇది దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ  హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్  ఎం క్యాప్ రూ. 9,12,986 కోట్ల కంటే తక్కువ కావడ గమనార్హం​.

జనవరి 24న ప్రారంభమైన అమ్మకాల సెగతో అదానీ గ్రూప్ స్టాక్‌లు గత పంతొమ్మిది సెషన్లలో రూ.11,43,702 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా సంస్థ ఎం క్యాప్‌ 19,18,058 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ( రూ.16,24,156 కోట్లు)  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.12,57,268 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోరర్ట్స్‌జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, గగ్రాసిం  భారీగా నష్టపోగా,   సిప్లా, ఐటీసీ, దివీస్‌, డా. రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో లాభాల్లో ఉన్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో 82.85 వద్ద ఉంది. 

Videos

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)