Breaking News

ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక

Published on Fri, 06/05/2026 - 15:05

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్‌ రూట్‌(వీఆర్‌ఆర్‌) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.

అసలేం జరిగింది?

సెక్యూరిటీ కస్టోడియన్‌ (Securities Custodian)గా  వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్‌ఆర్ ప్రోగ్రామ్‌ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.

సెబీ అభ్యంతరం

నిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్‌బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.

వీఆర్‌ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?

భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్‌ఆర్‌) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్‌పీఐ పెట్టుబడుల కోసం వీఆర్‌ఆర్‌ను జనరల్‌ రూట్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ వివరణ

సెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్‌మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.

ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!

#

Tags : 1

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)