Breaking News

ఎస్‌ఎస్‌ఈలో మరిన్ని ట్రస్ట్‌లకు చోటు

Published on Sat, 09/20/2025 - 09:04

సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ) ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తృతపరిచేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎస్‌ఎస్‌ఈ ద్వారా నిధుల సమీకరణకు మరిన్ని చారిటబుల్‌ ట్రస్ట్‌లను అనుమతించనుంది. ఈ బాటలో లిస్టింగ్‌ పరిధిని పెంచుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందుకు లాభాపేక్షలేని సంస్థ(ఎన్‌పీవో)ల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. దీంతో ఎస్‌ఎస్‌ఈ లిస్టింగ్‌ పరిధిలోకి మరిన్ని సంస్థలు చేరనున్నాయి.

ఇందుకు అనుగుణంగా 1908 ఇండియన్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం, సంబంధిత రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం, 1956 కంపెనీల చట్టంలో భాగంగా సెక్షన్‌ 25కింద రిజిస్టరైన కంపెనీలను తాజా మార్గదర్శకాలలోకి చేర్చింది. అయితే ఈ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతూ సంబంధిత నిబంధనలను సైతం ప్రకటించింది. ఎలాంటి సెక్యూరిటీలను లిస్ట్‌చేయని ఎన్‌పీవోలు ఏఐఆర్‌ నివేదికను సొంతంగా రూపొందించి దాఖలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఎన్‌పీవో ప్రధాన కార్యకలాపాలతోపాటు ఏడాది పొడవునా చేపట్టిన  ప్రోగ్రామ్‌లు, మధ్యవర్తిత్వాలు, ప్రాజెక్టులను వివరణలతో తెలియజేయవలసి ఉంటుంది. ఆయా సంస్థల ప్రాధాన్యతను గుర్తించేలా వీటిని రూపొందించవలసి ఉంటుంది.

ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్‌!
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)