Breaking News

వాటి జోలికి వెళ్లొద్దు​.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్‌!

Published on Sun, 12/08/2024 - 09:16

గత 30 రోజుల్లో క్లయింట్‌ ఎలాంటి లావాదేవీలను చేపట్టని సందర్భంలో తదుపరి సెటిల్‌మెంట్‌లో మూడు రోజుల్లోగా ఖాతాలోని నిధులను వెనక్కి ఇవ్వవలసిందిగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. ఖాతాల నెలవారీ రన్నింగ్‌ సెటిల్‌మెంట్‌ సైకిల్‌కు సంబంధించి స్టాక్‌ బ్రోకర్లకు సెబీ తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.

రానున్న సెటిల్‌మెంట్‌ రోజులకు ఇది వర్తించనున్నట్లు కన్సల్టేషన్‌ పేపర్‌లో పేర్కొంది. దీనికి క్వార్టర్లీ సెటిల్‌మెంట్‌గా సైతం పిలిచే సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు.. సరళతర బిజినెస్‌ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ తాజా మార్గదర్శకాలకు ప్రతిపాదించింది. వెరసి క్లయింట్ల నిధుల సెటిల్‌మెంట్‌ను తప్పనిసరి చేయనుంది. ఈ అంశాలపై ఈ నెల 26వరకూ సెబీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.

ఇదిలా ఉండగా అనామక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభించే అన్‌లిస్టెడ్‌ డెట్‌ సెక్యూరిటీస్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లొద్దని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. ఈ అన్‌రిజిస్టర్డ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.

కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ను అక్రమ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ఈ క్రమంలోనే మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. లిస్టెడ్‌ డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆథరైజ్డ్‌ స్టాక్‌బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్‌ ఆన్‌లైన్‌ బాండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లోకి మాత్రమే వెళ్లాలని సెబీ సూచించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)