Breaking News

రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్‌

Published on Sun, 11/24/2024 - 09:12

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రోష్నీ నాడార్‌ మల్హోత్రాకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్‌ ఆఫర్‌ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్‌ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్‌ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  

ఎందుకంటే.. 
గ్రూప్‌ కంపెనీలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌లలో రోష్నీ నాడార్‌ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్‌ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్‌ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.

రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్‌ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్‌ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్‌ ఇన్ఫొసిస్టమ్స్‌ ప్రమోటర్లు హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్‌ నుంచి వాటాలు లభించనున్నాయి.

ప్రస్తుతం రెండు ప్రమోటర్‌ సంస్థలలోనూ రోష్నీ నాడార్‌ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్‌సీఎల్‌కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రోష్నీ నాడార్‌ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)