Breaking News

ఏఐ వినియోగానికి మరింత ఆసక్తి చూపుతున్న ఎస్‌బీఐ

Published on Tue, 06/06/2023 - 06:52

న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి అధునాతన టెక్నాలజీల వినియోగాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెక్ట్స్‌జెన్‌ డేటా వేర్‌హౌస్, డేటా లేక్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఫిన్‌టెక్‌ సంస్థలు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో కలిసి రుణాలిచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ఎస్‌బీఐ ఈ విషయాలు వెల్లడించింది.

గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళికరాజకీయపరమైన సవాళ్లు, చైనాలో కోవిడ్‌ మళ్లీ విజృంభించడం మొదలైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతీయ ఎకానమీ దీటుగా నిల్చిందని, తమ బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో కూడా ఇది ప్రతిబింబించిందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా తెలిపారు. తమ బ్యాంకు గత మూడేళ్లుగా వరుసగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తోందని ఆయన వివరించారు. 

(ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..)

ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద గుర్తించిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, పునరుత్పాదక విద్యుత్‌ తదితర కొత్త రంగాలకు రుణాలు కల్పించడం ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు ఖరా చెప్పారు. 2022–23లో ఎస్‌బీఐ నికర లాభం (స్టాండెలోన్‌) 58 శాతం పెరిగి రూ. 31,676 కోట్ల నుంచి రూ. 50,232 కోట్లకు ఎగిసింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)