Breaking News

ఏఐలో దూసుకెళ్తున్న  చైనా కంపెనీలు 

Published on Sat, 01/25/2025 - 04:22

సాన్‌హొసే (యూఎస్‌): మొబైల్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని సామ్‌సంగ్‌ సౌత్‌వెస్ట్‌ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జె.బి.పార్క్‌ తెలిపారు. ఏఐ అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలతో ముప్పు తలెత్తే  అవకాశం ఉందని అన్నారు. భారత్‌లో ప్రత్యర్థి సంస్థలతో పోటీ ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. 

‘బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్‌గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్, ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టడమేగాక మొత్తం వ్యవస్థకు సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. భారత స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు సామ్‌సంగ్‌ సిద్ధంగా ఉంది’ అని వివరించారు. 

ప్రస్తుతం 800 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్‌–ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆపిల్‌ నుండి, అలాగే 400–600 డాలర్ల విభాగంలో చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారుల నుండి సామ్‌సంగ్‌ పోటీ ఎదుర్కొంటోంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్‌ అన్నారు. చిన్న పట్టణాల్లోనూ కంపెనీ తయారీ ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)