‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’

Published on Thu, 06/12/2025 - 11:23

భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఇటీవల తాను పోస్ట్‌ చేసిన వివరాలు వైరల్‌గా మారాయి. దాంతో భారత్‌ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

భాటియా తన ఎక్స్‌లో ఖాతాలో ‘భారత్‌లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్‌ చేశారు. జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్‌లో వ్యాఖ్యలు చేశారు.

భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్‌లోని వివరాలు అవుట్‌డేటెడ్‌గా కొందరు కామెంట్‌ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్‌ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్‌బీఐ ప్రాధాన్యం

‘1997 డిసెంబర్లో హాట్‌మెయిల్‌ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)