Breaking News

వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?

Published on Thu, 02/12/2026 - 16:20

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ యాప్‌లు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి కోట్లాది మంది వినియోగదారులను కలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో.. రష్యా ప్రభుత్వం తమ సేవలను దేశంలో పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించిందని వాట్సాప్ వెల్లడించింది. దీనికి కారణం.. ప్రభుత్వం నిర్వహించే 'మ్యాక్స్' సూపర్ యాప్‌ను ముందుకు తీసుకురావడానికే అని పేర్కొంది.

రష్యా మ్యాక్స్ యాప్
మ్యాక్స్ అనే యాప్‌ను రష్యా ప్రభుత్వం వీచాట్ (చైనా దేశంలో ప్రసిద్ధి చెందన యాప్) నమూనాను అనుసరించి రూపొందించింది. ఇది కేవలం మెసేజెస్, కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సేవలు, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్సక్షన్స్‌ చేయడానికి కూడా ఇది అనుమతిస్తుంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న అన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాక్స్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

''రష్యా ప్రభుత్వం వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. ప్రజలను ప్రభుత్వ యాజమాన్యంలోని యాప్‌కి నడిపించే ప్రయత్నం చేసింది. అయితే వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాము'' అని వాట్సాప్ ట్వీట్ చేసింది.

టెలిగ్రామ్ సేవలు పరిమితం!
రష్యా ప్రభుత్వం విదేశీ యాప్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే.. వాట్సాప్, టెలిగ్రామ్ సేవలను పరిమితం చేసింది. టెలిగ్రామ్ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, క్రిమినల్ & ఉగ్రవాద కంటెంట్ తొలగించలేదని ఆరోపణలు రావడంతో.. రష్యా కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జర్ టెలిగ్రామ్‌పై పరిమితులు విధించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, టెలిగ్రామ్‌పై 64 మిలియన్ రూబిళ్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

మ్యాక్స్ యాప్‌పై విమర్శలు
ఇక రష్యా ప్రభుత్వం నిర్వహించే.. మ్యాక్స్ యాప్‌పై విమర్శకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం ప్రభుత్వం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) ప్రకారం.. వాట్సాప్ రష్యాలో తిరిగి తన సేవలు యధావిధిగా అందించాలంటే, దేశంలోని చట్టాలను పూర్తిగా పాటించాలి. మెటా సంస్థ రష్యా అధికారులతో చర్చలకు సిద్ధంగా ఉంటే.. ఒప్పందం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మెటా మొండిగా ప్రవర్తిస్తే మాత్రం.. వాట్సాప్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చదవండి: రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?

Videos

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి

Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం

21 ఏళ్ల బంధం.. ఎప్పటికీ మధురమే.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..!

బన్నీ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్ స్రవంతి

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)