Breaking News

భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం

Published on Thu, 08/21/2025 - 15:10

అమెరికా టారిఫ్‌ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్‌ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.

రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్‌ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.

చమురు సరఫరాకు అంతరాయం లేదు

భారత్‌తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.

ఆంక్షలు ఉన్నప్పటికీ..

రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్‌-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్‌ 10 చమురు కంపెనీలు

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు