Breaking News

రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

Published on Tue, 02/17/2026 - 09:14

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్ స్థానాన్ని మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా రష్యా-అమెరికా మధ్య జరుగుతున్న ఈ కరెన్సీ గేమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అమెరికా డాలర్లలో వ్యాపారం సాగిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.

డాలర్ వైపు రష్యా మొగ్గు ఎందుకు?

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాలను డాలర్లకు బదులు రూబుల్స్, యువాన్, రూపాయిల్లోకి మార్చింది. అయితే, 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం రష్యా తిరిగి అమెరికన్ డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది.

ఇందుకు కారణాలు

అమెరికాలో ట్రంప్‌ మరోసారి అధ్యక్షడయ్యాక ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతోంది. ఇంధన రంగాలు, ఖనిజాల వ్యాపారంలో తిరిగి డాలర్లను అనుమతించడం ద్వారా ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలని రష్యా భావిస్తోంది. చైనా యువాన్ లేదా ఇతర కరెన్సీల కంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం కలిగి ఉండటం రష్యాకు అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇది కూడా రష్యా డాలర్లలో వ్యాపారం కొనసాగించాలనుకోవడానికి ఒక కారణంగా ఉంది.

ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం

రష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్‌లోకి వస్తే అది ‘డీ-డాలరైజేషన్’ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే, చమురు వ్యాపారం తిరిగి డాలర్లలో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.

భారత్‌పై ప్రభావమెంత?

రష్యా-అమెరికా మధ్య మారుతున్న ఈ ఆర్థిక సమీకరణాలు భారతదేశంపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విషయానికి వస్తే ఇప్పటివరకు రష్యా నుంచి రూపాయిల్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ కొంత లబ్ధి పొందింది. అయితే, రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లితే భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భవిష్యత్తులో భారత్ రష్యా నుంచి చేసే దిగుమతులను తగ్గించి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.

రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని గమనించాలి. బంగారం, ఎగుమతుల రంగంలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కింద తెలియజేశాం.

ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)