Breaking News

Indian Marriages: 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం..!

Published on Wed, 10/18/2023 - 14:16

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో మరపురాని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ బంధాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా భావిస్తారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల కలలకు తగ్గట్టుగా ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడతారు.. ఇందులో భాగంగానే బంధువులు, స్నేహితుల్లో ఎవరూ చేయని విధంగా పెళ్లిజరపాలనే తలంపుతో వైభవాన్ని చాటేలా చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడూ జరుగుతూ ఉన్నా.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు అంచనాలకు మించి ఆకాశాన్నంటుతున్నాయి. 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్‌లో కేవలం 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. సదరు నివేదిక ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 35లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహాల వల్ల సంబంధీకులు జరిపే కొనుగోళ్లు, ఇతర సేవలు కలిపి రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వే తెలిపింది.

ఈ ఏడాది మొత్తం పెళ్లిళ్లలో 10 శాతం అంటే 3.5 లక్షల పెళ్లిళ్లు ఒక్క దిల్లీలోనే ఉంటాయని అంచనా. మొత్తం వివాహాల్లో 50వేల మంది లగ్జరీ కేటగిరీలో ఉండనున్నారు. వారు కనీసం రూ.1కోటి  లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారని నివేదిక చెబుతుంది. మరో 50వేల పెళ్లిళ్లకు ఒక్కో దానికి రూ.50 లక్షల వరకు ఖర్చులు ఉంటాయి. అయితే దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు సుమారు రూ.25లక్షలు ఖర్చు చేయనున్నట్లు సర్వే వెల్లడించింది.

12లక్షల వివాహాలకు రూ.10 లక్షలు, మరో 10 లక్షల వివాహాలకు రూ.6 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. గత సంవత్సరం అదే 23 రోజుల సమయంలో మొత్తం 3.2 మిలియన్ల వివాహాలు జరిగాయి. ఫలితంగా రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం నమోదైందని సీఏఐటీ సర్వే చెప్పింది.

మధ్యతరగతి వివాహ వేడుకకు అయ్యే ఖర్చు సుమారుగా ఇలా..

  • కల్యాణ మండపం అద్దె(రోజుకు): రూ.2లక్షలు
  • పూల అలంకరణ, ఇతర వినియోగాలుఖ: రూ.1.50లక్షలు
  • భోజనం నిమిత్తం(క్యాటరింగ్‌)​‍:రూ.1.80క్షలు
  • వంట మనుషులు, సహాయకుల ఖర్చులు: రూ.30వేలు
  • కిరాణా సరకులు: రూ.60వేలు
  • కూరగాయల ఖర్చు: రూ.30వేలు
  • సన్నాయి వాయిద్యాలకు: రూ.20వేలు
  • డ్రింకింగ్‌ వాటర్‌: రూ.2వేలు
  • సలాడ్‌, పాన్‌, ఐస్‌క్రీం: రూ.25వేలు
  • కార్మికులు, సహాయకులకు: రూ.5వేలు
  • జనరేటర్‌: రూ.7వేలు
  • విద్యుత్తు లైట్లు, అలంకరణ: రూ.30వేలు
  • ఫొటో, వీడియోగ్రాఫర్‌: రూ.60వేలు
  • ఇవికాకుండా బంగారు ఆభరణాలు, బంధువుల కానుకలు అదనం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)