Breaking News

‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్‌ మూసివేత!

Published on Tue, 06/13/2023 - 18:30

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత టూల్స్‌ చాట్‌జీపీటీని విడుదలైన రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏఐ టెక్నాలజీ ముంచుకొస్తుంది. సమీప భవిష్యత్‌లో కృత్రిమ మేధ ఆధారిత చాట్‌ జీపీటీ చాట్‌బోట్‌లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ‘మానవాళి మనుగడకు టెక్నాలజీ ముప్పు’ అనే భయం నుంచి కాస్త ఉపశమనం కలిగించే ఘటన జరిగింది. 

కొన్నేళ్ల క్రితం ఏఐ టెక‍్నాలజీతో పనిచేసే రోబోట్‌ ఫిజ్జా డెలివరీ స్టార్టప్‌ 500 అమెరికన్‌ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దివాళా తీసింది. అందుకు కారణం ఏఐ ఆధారిత రోబోట్‌ టెక్నాలజీ కారణమని తెలుస్తోంది. 

అమెరికన్‌ టెక్‌ మీడియా సంస్థ ‘ది ఇన్ఫర్మేషన్‌’ కథనం మేరకు..కొన్నేళ్ల క్రితం పిజ్జాలను తయారు చేసేందుకు రోబోట్‌లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పిజ్జా తయారీ నిర్వాహకుల మదిలో మెదిలింది. కానీ టెక్నాలజీ పరంగా అనే ఒడిదుడుకులు ఎదురువుతాయనే అంచనాతో అనేక సంస్థలు తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేకపోయాయి. 

అదే సమయంలో 2015లో జుమే (Zume) సంస్థ ఏఐ ఆధారిత రోబోట్‌తో పిజ్జాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర‍్వహణకోసం ఇన్వెస్టర్ల నుంచి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా సాఫ్ట్‌ బ్యాంక్‌ కంపెనీతో సహా, పెట్టుబడిదారులు జుమేలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డారు. వెరసీ 500 మిలియన్‌ డాలర్లను సమీకరించింది.   

మార్కెట్‌లో కృత్రిమ మేధ ఊహించని పురోగతి సాధించినప్పటికీ పిజ్జాను తయారు చేయడంలో విఫలమైంది. పిజ్జా తయారీ కోసం వెన్నను వినియోగించాలి. అయితే, తయారు చేసిన పిజ్జాను ముక్కలు, ముక్కలుగా చేసుకొని తినే సమయంలో అందులోని వెన్న కరిగిపోకుండా, అలాగే జారిపోకుండా నిరోధించేందుకు అనేక కంపెనీలు విఫలమవుతూ వచ్చాయి. వాటిల్లో జుమే ఒకటి. 

రోబోట్‌లతో పిజ్జాలను తయారు చేసే సమయంలో తలెత్తే ఈ సమస్యకు జుమే సైతం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఫండింగ్‌ ఇవ్వడం ఆపేశారు.  ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సగానికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా, సంస్థ దివాళా తీసింది.

ఈ తరుణంలో ప్రస్తుత మార్కెట్‌లో ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్ధ్యం పూర్తి స్థాయిలో  ఉపయోగంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని, అందుకు షట్‌ డౌన్‌ చేసిన జుమే సంస్థేనని చెబుతున్నారు. అప్పటి వరకు మానవాళి మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. 

చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)