Breaking News

బంగారం ధర తగ్గినా.. గోల్డ్‌ మైనింగ్‌లో భారీ లాభాలు!

Published on Sat, 11/28/2026 - 18:03

బంగారం ధరలు తగ్గుతున్నాయంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ రచయిత, ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణుడు రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki)అభిప్రాయపడ్డారు. బంగారం ధర ఒక్కరోజే ఔన్సుకు 73 డాలర్లు తగ్గి 3,713 డాలర్లకు చేరడంతో మార్కెట్‌లో బంగారం బుడగ పేలిందంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవడం కంటే.. బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు.

‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత కియోసాకి తన ఫేస్‌బుక్‌ పోస్టులో ఈ అంశాలను ప్రస్తావించారు. బంగారాన్ని భద్రంగా దాచుకోవడం సంపదను కాపాడితే.. బంగారు గని ఆదాయాన్ని అందిస్తుందని తన రిచ్‌ డాడ్‌ చెప్పేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రైవేటు బంగారు గనుల్లో ఒక ఔన్స్‌ బంగారాన్ని వెలికితీసేందుకు సుమారు 1,500 డాలర్లు ఖర్చవుతోందని వివరించారు. మార్కెట్‌లో ఔన్స్‌ ధర 3,713 డాలర్లుగా ఉన్నందున, ఖర్చులు మినహాయించకముందే ఒక్కో ఔన్స్‌పై 2,200 డాలర్లకు పైగా వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రైవేటు గనుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు సామాన్య ఇన్వెస్టర్లకు సులభంగా అందుబాటులో ఉండవని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బిలియనీర్లు, కుటుంబ కార్యాలయాల కోసం 9 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడుల సమీకరణలో అనుభవం ఉన్న డెవన్‌ జాన్సన్‌ పరిచయమయ్యారని తెలిపారు. ఆమె ఏర్పాటు చేసిన 'క్యాపిటల్‌ క్లబ్‌' ద్వారా ప్రైవేటు పెట్టుబడుల అవకాశాలను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వేదికలో అనుభవజ్ఞులైన భూగర్భ అన్వేషణ నిపుణులు నిర్వహిస్తున్న ప్రైవేటు బంగారం, వెండి మైనింగ్‌ సంస్థలో పెట్టుబడులకు అవకాశం ఉందని చెప్పారు. ఈ సంస్థ భవిష్యత్తులో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని, ముందుగానే పెట్టుబడులు పెట్టేవారికి 4 నుంచి 8 రెట్ల రాబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇవి అంచనాలు మాత్రమేనని, పెట్టుబడిపై రాబడికి హామీ లేదని గుర్తుంచుకోవాలి.

భారత్‌లో బంగారం ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు రోజుకో రీతిలో మారిపోతున్నాయి. రెండు రోజులుగా భారీగా పెరిగి బెంబేలెత్తించిన పసిడి ధరలు నేడు (శనివారం) కొంత తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని కాగా భారత్‌లోని ప్రధాన నగరాలలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడొచ్చు..

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)