Breaking News

35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్

Published on Fri, 06/26/2026 - 17:55

బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.

'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.

అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)