Breaking News

బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?

Published on Thu, 06/25/2026 - 14:21

ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్‌కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.

మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్‌లో సూచించారు.

Videos

TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట

కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్

భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!

నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం

పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్

లోకల్ బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!

మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం

రిమాండ్ రిపోర్టులో అసలు నిజాలు.. సీఐ నాగరాజు దొరికిపోయింది ఇలాగే..!

RC17 అప్డేట్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫాన్స్

Photos

+5

రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్‌లో సిమ్రాన్‌ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి వేకేషన్‌లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)