Breaking News

క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!

Published on Sat, 06/13/2026 - 04:29

ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూనే.. దీనికి 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఆ మొత్తం ఖర్చు చేయడానికి మీకు 34,000 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద సంఖ్య అనేది స్పష్టమవుతోంది.

ఒక సాధారణ మనిషికి ట్రిలియన్ డాలర్లు ఊహించడం కూడా చాలా కష్టం. కానీ ఫెడ్, యూఎస్ ట్రెజరీకి ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రించడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు.

కియోసాకి ప్రకారం.. డబ్బు భద్రమైన పెట్టుబడి కాదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమయంలో దీని విలువ క్రమంగా తగ్గుతుంది. కాబట్టి డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు. క్యాష్ ఈజ్ ట్రాష్ అంటూనే.. మీ డబ్బును బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రిచ్ డాడ్ వివరించారు.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి పెట్టుబడికి లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తే, క్రిప్టోకరెన్సీలు ఎక్కువ మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు, ప్రమాద సహనాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు