Breaking News

బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి

Published on Thu, 11/20/2025 - 13:27

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకిని కూడా తాకింది.

డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్‌ ఫేక్‌ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్‌ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్‌ చేశారు. ‘ఫెడ్‌ (ఫెడరల్‌ రిజర్వ్‌) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.

‘నకిలీ రాబర్ట్‌ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.

తనపై ఇలా డీక్‌ ఫేక్‌ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)